కరోనా ఎఫెక్ట్ : కీలక నిర్ణయం తీసుకున్న రాజ్ భవన్

By రాణి  Published on  14 March 2020 7:47 AM GMT
కరోనా ఎఫెక్ట్ : కీలక నిర్ణయం తీసుకున్న రాజ్ భవన్

కరోనా మహమ్మారి భయంతో..ఇప్పటికే ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఆదేశాలిచ్చాయి. కర్ణాటకలో ఇప్పటికే వ్యాపార సంస్థలు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఇప్పటికే మూతపడ్డాయి. తాజాగా తెలంగాణ రాజ్ భవన్ వర్గాలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలే అని తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో..ప్రజలు గుంపులు గుంపులు తిరగరాదని, ఎక్కువగా సమావేశాలు, ఫంక్షన్లు నిర్వహించరాదని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలోనే రాజ్ భవన్ వర్గాలు గవర్నర్ కార్యక్రమాల్ని వాయిదా వేసినట్లు సమాచారం.

Also Read : ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులు జంప్..ఆందోళనలో అధికారులు

అయితే వాయిదా వేసిన గవర్నర్ కార్యక్రమాలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ మాత్రం చెప్పలేదు. కేంద్రం ప్రస్తుతం ఇచ్చిన నిబంధనలను సడలించాకే వీటిపై పూర్తి సమాచారం వచ్చే అవకాశముంది.

కాగా..తెలంగాణకు ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్థారణైనట్లు స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసు బాధితుడు కోలుకుని ఇంటికి చేరుకున్నప్పటికీ..వైరస్ లేదులే అని ఊపిరి పీల్చుకునే అవకాశం లేదు. గాంధీలో ఇప్పటికీ పలువురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. అలాగే నిన్న వరంగల్ నిట్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలుండగా..అతడికి కరోనా నెగిటివ్ అని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. ప్రాణాలొదిలిన కూతురు!

కరోనా పై వదంతులు పుట్టించవద్దని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలా ? లేదా ? అన్నదానిపై అసెంబ్లీలో చర్చించారు. మరోవైపు ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సినిమా థియేటర్లు, మాల్స్ ఇతరత్రా షాపింగ్ మాళ్లను మూసివేయడానికి..ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి.

Next Story