కన్న కూతురి కాపురాన్ని చక్కదిద్దాల్సిన తల్లే కూతురు చావుకు కారణమైంది.. కూతురు భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని సభ్యసమాజం తలదించుకొనేలా చేసింది. ఎన్నిసార్లు మందలించినా అటు భర్త, ఇటు తల్లి వ్యవహార శైలిలో మార్పురాకపోవటంతో ఎవరికి చెప్పుకోలేక మానసిక వేదనకు గురైన ఆ మహిళ.. ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది. ఈ విషాద ఘటన  మీర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అనిత కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటోంది. అనిత క్యాటరింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది.

Also Read :30 అడుగుల గోతిలో పడ్డ బైక్.. తర్వాత ఏమైందంటే..

ఈ క్రమంలో అదే వృత్తిలో ఉన్న ఆమెకు ప్రేమ్‌ నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నవీన్‌ తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు. ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందనను  నవీన్‌కుమార్‌కు ఇచ్చిన గత సంవత్సరం డిసెంబర్‌లో వివాహం జరిపించింది. వివాహమైన తరువాత కూడా నవీన్‌, అనితల అక్రమ సంబంధం కొనసాగింది.

Illicit relationship

తల్లితో తన భర్త చనువుగా ఉండటాన్ని గమనించిన వందన తన భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోయి వేరుగా ఉందామని బలవంతం చేసింది. కానీ తల్లి అనిత ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని బెదిరించింది. దీంతో తల్లి మోసం, భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మానసిక వేదనకు గురై వందన ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.