Fact Check : 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ డైరెక్టర్ కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2020 3:18 PM GMT
Fact Check : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ డైరెక్టర్ కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నాడా..?

బాలికా వధు.. సుదీర్ఘకాలం బుల్లితెరపై ప్రసారమైన సీరియల్లో ఇది కూడా ఒకటి. 'చిన్నారి పెళ్లి కూతురు' అనే పేరుతో తెలుగులో కూడా ఈ సీరియల్ కు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ రోజుల్లో..! ఆ సీరియల్ కు పని చేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు కూరగాయలు అమ్ముతూ కనిపించాడంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.



రామ్ విృక్ష కౌర్.. కలర్స్‌ టీవీలో ప్రసారమైన ‘బాలికా వధు’ సీరియల్‌కి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్. ప్రస్తుతం ఓ తోపుడు బండి మీద కూరగాయలమ్ముకుంటున్నాడు. న కరోనా కారణంగా బాలికా వధు సీరియల్‌ దర్శకుల్లో ఒకరైన రామ్‌ వ్రిక్ష గౌర్‌ ప్రస్తుతం అజంగఢ్‌ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు.

సీరియల్ కు సంబంధించిన లీడ్ క్యాస్ట్ ఎక్కడ ఉంది.. ఆ సీరియల్ కు పని చేసి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళెవరూ అతడిని ఆదుకోడానికి ముందుకు రావడం లేదా..? అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.



“Balika Vadhu’ Director Now Sells Vegetables in UP’s Azamgarh. Ram Vriksha Gaur started selling vegetables after a project of his stalled,” అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.

A1

అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు నిజమే..!

కరోనా కారణంగా బాలికా వధు సీరియల్‌ దర్శకుల్లో ఒకరైన రామ్‌ వ్రిక్ష గౌర్‌ ప్రస్తుతం అజంగఢ్‌ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఓ సినిమా కోసం రెక్కి నిర్వహించడానికి తాను అంజగఢ్‌ వచ్చానని.. అంతలోనే లాక్‌డౌన్‌ విధించారని తెలిపాడు. దీంతో తన తండ్రి వ్యాపారమైన కూరగాయలను అమ్మడాన్ని స్వీకరించాడు. దీన్ని తాను సిగ్గుగా భావించడం లేదంటున్నాడు ఈయన.

తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాలని భావించాడు.. దానికి తోడు సినిమా కూడా మరో ఏడాది పడుతుందని తెలపడంతో అక్కడే ఉండిపోయాడు రామ్. అందుకే ఇలా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నాడు రామ్ విృక్ష. 18 ఏళ్ల కిందట.. 2002లో తన స్నేహితుడు, రచయిత షహనాజ్‌ ఖాన్‌ సాయంతో ముంబై వెళ్లినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ బాలికా వధు సీరియల్‌కు యూనిట్ అండ్ ఎపిసోడ్ డైరెక్టర్‌గా పని చేసాడు.



రామ్ పరిస్థితిపై నటుడు అనూప్ సోని స్పందించాడు. అతడికి సహాయం కూడా చేశాడు. అనూప్ సోని మాట్లాడుతూ తాను ఒక్కడినే కాదని.. బాలికా వధు టీమ్ లో పని చేసిన చాలా మంది అతడికి సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నారని.. అతడికి టచ్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారని తెలియజేశాడు.

ఇప్పటికే తమ టీమ్ అతడి అకౌంట్ డీటైల్స్ ను తీసుకుందని.. సహాయం చేస్తూ ఉన్నామని మీడియాకు తెలిపారు. అతడికి ఏయే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి తాము ముందున్నామని మీడియాకు చెప్పారు అనూప్ సోని.

వైరల్ అవుతున్న పోస్టు 'నిజమే'.

Claim Review:Fact Check : 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ డైరెక్టర్ కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నాడా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story