'దిల్ బేచారా' అరుదైన రికార్డు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 4:25 AM GMT
దిల్ బేచారా అరుదైన రికార్డు..

శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సీఫీసు దగ్గర సినిమా విడుదల పరీక్ష మొదలవుతుంది. తొలి ఆట ముగిసినంతనే దాని ఫ్యూచర్ ను తేల్చేస్తారు. సినీ విమర్శకులు మొదలు.. సోషల్ మీడియా విమర్శకులతో పాటు.. యూట్యూబ్ చానళ్లు లెక్కలు తేలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా పుణ్యమా అని శుక్రవారం సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.

థియేటర్లు మూసివేసినా.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద సినిమాల్ని విడుదల అవుతూ కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేశాయి. సినిమా హాళ్లు లేకపోవటంతో ఓటీటీ ఫ్లాంఫాంకు పెరిగిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు.. అందరి మన్ననలు అందుకోవటేమ కాదు.. మెలితిప్పే భావోద్వేగాలు ఈ సినిమా సొంతమని వ్యాఖ్యానిస్తున్న వారు బోలెడంతమంది.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హీరోగా నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా'. ముఖేశ్ చబ్రా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సంఘీ కథానాయికగా వ్యవహరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో డిస్నీ.. హాట్ స్టార్ కలిసి తమ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద ఈ సినిమాను ఈ శుక్రవారం విడుదలైంది. సుశాంత్ నటన.. హీరోహీరోయిన్స్ మధ్య నడిచే ఎమోషన్స్.. ప్రేక్షకుల్నే కాదు విమర్శకుల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలోనూ దిల్ బేచారా డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. సుశాంత్ చివరి సినిమా అనే భావోద్వేగం కూడా దీనికి తోడైంది. వెరసి.. ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ సినీ డేటాబేస్ వెబ్ సైట్ ఐఎండీబీ ఈ సినిమాకు 10/10 రేటింగ్ ఇచచింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణతో పాటు.. సానుకూల రివ్యూలతో ఇలాంటి పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు సుశాంత్ బతికి ఉంటే.. ఈ విజయాన్ని ఎంతలా ఆస్వాదించేవాడో?

Next Story