దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. సినిమా రంగానికి చెందిన పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తో పాటు కోలీవుడ్‌లో అర్జున్‌ ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. తాజాగా హీరో విశాల్‌ కుటుంబానికి కరోనా పాజిటివ్‌ అంటూ కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తల్లో నిజం ఉందా..? లేదా..? అనే దానికి హీరో విశాల్‌ ట్వీట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ‘ఆ వార్తలు నిజమే. మా నాన్నకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆయనకి సాయం చేసే క్రమంలో నాకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇవే లక్షణాలు నా మేనేజర్‌లో కూడా ఉన్నాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నాము. ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడతాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గుడ్ బై’ అని విశాల్ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.