మధుమేహం అదుపులో ఉండాలంటే..
By సుభాష్ Published on 21 Aug 2020 6:30 AM ISTప్రస్తుత కాలంలో చిన్నా అనే తేడా లేకుండా డయాబెటిస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. మధుమోహాన్ని షుగర్, చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. వైద్యులు సూచించిన మందులతో పాటు సరైన ఆహార అలవాట్లను పాటిస్తే మధుమోహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. వైద్య నిపుణుల సూచనల ప్రకారం..
షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి రోజూ కనీసం అరగంట పాటు వ్యాయమం చేయాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం వల్ల వ్యాధి అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారి గుండె రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొలెస్టాల్ అధికంగా ఉండే కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోకుంటే మంచిది.
అలాగే ఈ వ్యాధి ఉన్నవారు మద్యపానానికి దూరంగా ఉండాలి. అప్పుడు డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
తీసుకునే ఆహార పదార్థాలు :
చేపలు:
మధుమోహం ఉన్న వారు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డెన్, అల్బకోర్ ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటి ఆసిడ్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే వాంలో రెండు సార్లయినా చేపలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పప్పు దినుసులు:
షుగర్ వ్యాధి ఉన్నవారికి పప్పు దినుసులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. వారు తీసుకునే డైట్‌లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు మాంసహారంలో కంటే పప్పు దినుసుల్లో అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా అడ్డుకుంటాయి.
కూరగాయలు :
మధుమేహం ఉన్నవారు అన్ని రకాల కూరగాయలు.. వంకాయ, బెండకాయ, ఉల్లిపాయలు, మొలకలు, క్యాబేజీ, కాలిప్లవర్, పుదీన, బొప్పాయి, కరివేపాకు, బ్రకోలి, దోసకాయ, ముల్లంగి, బెంగళూరు వంకా, టమాట, చిక్కుడు, కొత్తిమీర, సోరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఓట్స్ :
ఓట్స్‌లో శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.
అలాగే వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయమాలు వంటివి చాలా ముఖ్యం. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్లుగా మందులు వేసుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్యులు.