మామూలుగా పిల్లలు ఏడవడం మనం చూస్తూనే ఉంటాము. ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ఏడుస్తుంటారు. వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక తికమక పడుతుంటాము. వారు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పలేని పరిస్థితి. వారి ఏడుపును మార్పించేందుకు ఎన్ని చిట్కాలు చేసినా ఎంతకి మానరు. వారి ఏడుపులో ఎన్నో అర్థాలున్నాయని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అయితే పసి పిల్లలు రోజుకు మూడు గంటల పాటు ఏడుస్తారని చెబుతున్నారు. పిల్లలు అలా ఏడవడం వల్ల ప్రయోజనం కూడా ఉందంటున్నారు. అలా ఏడవడమే వారి భాషగా మారుతుందట. ఏడవడం ద్వారానే పిల్లలు వారికి కావాల్సినవి తెలియజేస్తారని పరిశోధకులు చెబుతున్నారు.

పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు..

పిల్లలకు ఆకలిగా ఉన్న సమయంలో కొద్దిగా పెద్దగా మధ్యలో విరామం ఇవ్వకుండా ఏడుస్తారు. పిల్లలకు అసౌకర్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సైతం హడలెత్తించి బిగ్గరగా ఏడుస్తూనే ఉంటారు. ఇలా విడవని ఏడుపునకు ఏ కడుపునొప్పో, చెవినొప్పో కారణం కావచ్చని, అలాంటి సమయంలో వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

తల్లిదండ్రులను రప్పించుకోవాలనే భావనతో..

అలాగే పిల్లలు ఏమీ తోచక తల్లిదండ్రులను వాళ్ల దగ్గరకు రప్పించుకోవాలనే భావంతో ఏడుస్తారు. ఇలా ఏడ్చేది తాపీగా మధ్య మధ్యలో అపుతూ ‘ఉ..ఊ’ అంటూ ఏడుస్తారు. ఇలాంటి ఏడుపును పసిగట్టిన తల్లులు వెంటనే ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఎత్తుకుని ఆడించకుండా నాలుగైదు నిమిషాలు ఆగి వెళ్లాలి. లేకపోతే చంటి పిల్లలైనా అదే అలుసుగా తీసుకుని పదే పదే ఏడుస్తూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల ఏడుపుల్లో ఎన్నో కారణాలు

పిల్లల ఏడుపుల్లో చాలా రకాలున్నాయంటున్నారు బాలల మనస్తత్వ శాస్త్రవేత్తలు. పిల్లల ఏడుపును గ్రహించాల్సి ఉంటుంది. ఈ తేడాలను గుర్తించలేకపోయినా తల్లులు వెంటనే స్పందించి వారెందుకు ఏడుస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ లాలిస్తే, తల్లి తనను కనిపెట్టుకునే ఉందనే ఆత్మవిశ్వాసం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. చంటి పిల్లలకు ఒకటి, రెండు నెలల నుంచే తల్లి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఏడ్చిన వెంటనే లాలిస్తూ, బుజ్జగిస్తూ.. సన్నగా పాట పాడుతూ నిద్రపోయేలా చేయాలి. సన్నగా సంగీతాన్ని వినిపించడం వల్ల కూడా పిల్లలు ఏడుపుమాని నిద్రలోకి జారుకుంటారు. అతిగా ఏడుస్తూ నిద్రపోని పిల్లలను వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort