ఆవిరి పట్టడం వల్ల కరోనాకు చెక్‌ పెట్టవచ్చు: వైద్య నిపుణులు

By సుభాష్  Published on  17 Aug 2020 1:53 PM GMT
ఆవిరి పట్టడం వల్ల కరోనాకు చెక్‌ పెట్టవచ్చు: వైద్య నిపుణులు

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే వణికిపోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. వైరస్‌ బారిన పడితే ప్రాణాలు పోతాయోమోనన్న భయం ప్రతి ఒక్కరిలో పట్టుకుంది. ఈ వైరస్‌కు చెక్‌పెట్టేందుకు సరైన మందు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ ప్రయోగ దశలో ఉంది. ఈ క్రమంలో కొందరు పరిశోధకులు మాత్రం కరనా వైరస్‌కు వైరస్‌కు విరుగుడు ఆవిరి పట్టడమే (స్టీమ్‌ థెరఫీ) ఏకైక మార్గమని చెబుతున్నారు. ఆవిరి పట్టడం వల్ల ఎంతో మేలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేశాయి.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఓ క్రమ పద్దతిలో ఆవిరి పట్టడం ద్వారా కరోనాకు చెక్‌ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకిన వారు తొలి నుంచే జాగ్రత్తలు పాటిస్తే త్వరగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ మూడు పూటలా 15 నిమిషాల పాటు ఆవిరి పట్టడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఓ పాత్రలో మరిగించిన నీటిలో పసుపు, జండుబాయ్‌ లాంటిది వేసి పావుగంట పాటు ఆవిరి పీల్చినట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇలా ఆవిరి పట్టడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి వాటి పనితీరు మెరుగుపడుతుందని, శ్వాసక్రియకు అడ్డుపడుతున్న ఇన్‌ఫెక్షన్‌ లాంటివి తొలగిపోయి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొందరు అతిగా కషాయం తాగేస్తున్నారని, మరి కొందరు ఇష్టం వచ్చినట్లు మందులు వాడుతున్నారని, ఇలా చేసినట్లయితే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందంటున్నారు. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరి ఆక్సిజన్‌ వెళ్లకుండా అడ్డుపడుతోందని, పరిస్థితి విషమించినట్లయితే న్యూమోనియాకు దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఆవిరి పట్టడం వల్ల కరోనా నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Next Story