ధోనీ భారీ సిక్స్.. బంతిని ఇంటికి తీసుకెళ్లిన లక్కీ మ్యాన్.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 23 Sept 2020 6:04 PM ISTచెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్లు పోటీపడి బౌండరీలు బాదడంతో.. మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదు అయ్యాయి. రాజస్థాన్ ఆటగాళ్లు మొత్తం 17 సిక్సర్లు, చెన్నై ఆటగాళ్లు 16 సిక్సర్లు కొట్టారు. అందులో అత్యధికంగా సంజు సామ్సన్ 9 సిక్సర్లు, ఫాఫ్ డుప్లెసిస్ 7, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 , ఎంఎస్ ధోని 3 , సామ్ కర్రన్ 2 సిక్సర్లు బాదారు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడినా.. ధోని సిక్సర్లు మ్యాచ్‌కు హైలెట్‌గా మారాయి.
ధోనీ విధ్వంసానికి రాజస్థాన్ రాయల్స్ బౌలర్ టామ్ కరన్ బలయ్యాడు. అతను వేసిన ఆఖరి ఓవర్‌లో మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడిన మహీ..ఆ వెంటనే మరో రెండు భారీ సిక్సర్లు కొట్టారు. ఇందులో రెండు సిక్స్ అయితే ఏకంగా మైదానం బయటపడింది. 92 మీటర్ల దూరంలో పడిన ఈ బంతిని ఓ వ్యక్తి మురిపంగా తన ఇంటికి తీసుకెళ్లడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ ట్విటర్‌రో పంచుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మహీ సూపర్ ఇన్నింగ్స్‌పై ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాల ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ధోనీ ఈ మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 సిక్సర్లతో 29 రన్స్ చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ సంజూ శాంసన్ (74; 32 బంతుల్లో 1×4, 9×6), స్టీవ్ స్మిత్ (69; 47 బంతుల్లో 4×4, 4×6), జోఫ్రా ఆర్చర్ (27; 8 బంతుల్లో 4×6)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఫాఫ్ డూప్లెసిన్ (72; 36 బంతుల్లో 1×4, 7×6) ఒంటరి పోరాటం చేసినా.. ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదినా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, టామ్ కరణ్ తలో వికెట్ తీశారు. శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.