ప్ర‌స్తుతం కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. ఈ వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ఆర్థిక‌, క్రీడా, ర‌వాణా రంగాలు ఘోర‌మైన గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. ఇక‌ కరోనా కార‌ణంగా బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టోర్నీలన్నీ రద్దయ్యాయి. మూడు రోజుల క్రితం ఇండియా, సౌతాఫ్రికాల మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ మూడు వన్డేల సిరీస్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. 29నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్‌-13ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది.

దీంతో.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ప్రాక్టీస్‌ సెషన్‌కు ముగింపు పలికి ఎవ‌రి ఇళ్ల‌కు వారు వెళ్లారు. ధోనీ కూడా శనివారమే త‌న స్వస్థలం జార్కండ్‌కు వెళ్లాడు. కరోనా కార‌ణంగా ఆట‌గాళ్లంతా ఇళ్లకే పరిమితం అవుతుంటే.. ధోనీ మాత్రం ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నాడు. రాంచి వీధుల్లో.. బైక్‌ రైడ్‌కు వెళ్లాడు. హెల్మెట్‌ పెట్టుకుని బైక్‌పై షికార్ చేశాడు. వెళుతూ.. వెళుతూ.. ఓ ట్రాఫిక్ సిట్న‌ల్ ద‌గ్గ‌ర ఆగ‌గా.. ఫ్యాన్స్ అంతా ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ పోటోలు చూసిన నెటిజ‌న్లు.. భ‌ళా ధోనీ.. క‌రోనా భ‌యం లేదు.. ధోనీకి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక చెన్నై నుండి ఇంటికి వ‌చ్చిన ధోనీ.. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం కోసం బ్యాడ్మింట‌న్ ఆడాడు. జెఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో డ‌బుల్స్ మ్యాచ్ ఆడిన ధోనీ.. నెట్ వ‌ద్ద షాట్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన‌ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.