అనుమానంతో నా బ్యాట్‌ను చెక్ చేశారు.. ధోని మద్దతు నాకు లేదు : యువీ
By తోట వంశీ కుమార్ Published on 19 April 2020 11:49 AM GMT2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్ కప్ లను టీమ్ ఇండియా కైవసం చేసుకోవడంతో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా.. ఓ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2007 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో సువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. క్రికెట్ ప్రేమికులు ఎవరూ ఈ విషయాన్ని అంత త్వరగా మరిచిపోరు. కాగా.. నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు యువరాజ్. ఆ రోజు బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాక మ్యాచ్ రిఫరీ వచ్చి తన బ్యాట్‌ను పరిశీలించాడని చెప్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 70 పరుగులు చేయడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ తరువాత కూడా తన బ్యాట్‌లో ఏదో ఉందని పలువురు సందేహాలు వ్యక్తం చేశారని యువీ తెలిపాడు. మీకు అనుమానాలు ఉంటే.. నా బ్యాట్‌ను చెక్ చేసుకోమని చెప్పానని అన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఉపయోగించిన బ్యాట్ తనకెంతో ప్రత్యేకమన్నాడు.
ఇక ప్రతి కెప్టెన్‌కు ఓ ఇష్టమైన ఆటగాడు ఉంటాడని.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అప్పట్లో సురేష్ రైనా అంటే ఇష్టమన్నాడు. రెనాకు బాగా మద్దతు ఇచ్చాడని చెప్పాడు. 2011 ప్రపంచకప్ సమయంలో యూసఫ్ పఠాన్, నేను ఫామ్‌లో ఉన్నామని, రైనా చెప్పకోదగ్గ ఫామ్‌లో లేకపోవడంతో.. జట్టు ఎంపిక సమయంలో టీమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇబ్బంది పడిందన్నాడు. ఎందుకంటే.. రైనాకు ధోని మద్దతు ఉందన్నాడు. నేను ఆల్ రౌండర్ కోటాలో ఎంపిక కాగా.. పఠాన్‌ను లీగ్ మ్యాచ్‌లో ఆడించారని, ఆ మ్యాచుల్లో అంతగా పటాన్ ఆకట్టుకోలేదన్నాడు. దీంతో రైనాకు అవకాశం ఇచ్చారని.. అయితే.. రైనా ఒక్క మ్యాచ్‌లో కూడా టీమ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేదన్నాడు. తనకు ఇష్టమైన కెప్టెన్ సౌరవ్ గంగూలి అని.. అతనిలా ధోని తనను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నాడు.