'షీలాకీ జ‌వానీ' అంటున్న వార్న‌ర్.. వీడియో వైర‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2020 1:41 PM GMT
షీలాకీ జ‌వానీ అంటున్న వార్న‌ర్.. వీడియో వైర‌ల్

కరోనా వైరస్ దెబ్బకి క్రీడారంగం కుదేలైంది. ప‌లు టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని టోర్నీలు పూర్తిగా ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇక‌ లాక్‌డౌన్ కాలంలో తాము ఏం చేస్తున్నామో అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

తాజాగా ఆస్ట్రేలియా విధ్యంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ బాలీవుడ్ పాట‌ల‌కు డ్యాన్స్ చేశాడు. త‌న కూతురి కోరిక మేర‌కు మూడు రోజుల క్రిత‌మే టిక్‌టాక్‌లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు వార్న‌ర్‌. బాలీవుడ్ పాపుల‌ర్ సాంగ్ అయిన 'షీలాకి జ‌వానీ' సాంగ్‌కు వార్న‌ర్ సెప్టులు వేశాడు. స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ఆడి పాడిన.. ఈ పాట‌కి ఈ ఆస్ట్రేలియా ఓపెన‌ర్ త‌న కుమారైతో క‌లిసి డ్యాన్స్ చేశాడు. ఇద్ద‌రు డ్యాన్స్ చేసిన తీరు నెటీజ‌న్ల‌ను న‌వ్విస్తోంది. వార్న‌ర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పంచుకున్నాడు. ‘ ఇండీ మీ కోసం ఇంకోసారి చేద్దామని అడిగింది.. మా కోసం ఎవ‌రైనా సాయం చేయండి' ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. వార్న‌ర్ పోస్టు చేసిన ప‌ది గంటల్లో 6 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 'వార్న‌ర్ అద‌ర‌గొట్టారు'.. 'తండ్రికూతురు.. క‌త్రినా కంటే అద్భుతంగా డ్యాన్స్' చేశారంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Next Story
Share it