మిస్ట‌ర్ కూల్‌కి కోప‌మొచ్చిన వేళ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2020 4:24 PM GMT
మిస్ట‌ర్ కూల్‌కి కోప‌మొచ్చిన వేళ..

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనిని అభిమానులు ముద్దుగా మిస్ట‌ర్ కూల్ అని పిలుచుకుంటారు. ఎలాంటి సంద‌ర్భాల్లోనైనా ధోని త‌న స‌హానాన్ని కోల్పోడు. అందుకే అత‌డిని మిస్ట‌ర్ కూల్ అని పిలుస్తారు. కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ధోని కోప్ప‌డిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. ధోని కోపాన్ని చూసిన వారిలో చైనామ‌న్ కుల్దీప్ యాద‌వ్ ఒక‌డు. మూడేళ్ల క్రితం.. 2017 ఇండోర్‌లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోని కోపాన్ని చూశాడు కుల్దీప్‌. తాజాగా ఆనాటి ఘ‌ట‌న‌ గురించి చెప్పాడు.

ఆ మ్యాచ్ లో శ్రీలంక ఆట‌గాడు కుశాల్ పెరీరా ఓ బంతిని క‌వ‌ర్స్ వైపు షాట్ ఆడి బౌండ‌రీని సాధించాడు. ఆత‌రువాత ధోని ఫీల్డింగ్‌లో మార్పులు చేసుకోమ‌ని చెప్పాడు. అయితే ఆ విష‌యం నాకు వినిపించ‌లేదు. నేను మాములుగానే మ‌రో బంతి వేశాను. ఈ సారి రివ‌ర్స్ స్వీప్‌తో మ‌రో బౌండ‌రీ కొట్టాడు. దీంతో ధోని ప‌ట్ట‌రాని కోపంతో నా ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. "నేను ఏమైనా పిచ్చివాడినా..? 300 వ‌న్డేలు ఆడా.. అయినా నువ్వు నా మాట విన‌డం లేదూ" అంటూ ధోని సిరీయ‌స్ అయ్యాడ‌ని ఆనాటి సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నాడు కుల్దీప్‌. ఆ స‌మ‌యంలో నేను చాలా భ‌య‌ప‌డ్డాను. వెంట‌నే ఏమీ జ‌రిగిందోన‌ని ఆలోచించాను. ఆ మ్యాచ్‌లో విజ‌యం సాధించాక హోట‌ల్ రూమ్‌కు వెలుతుండ‌గా.. "నేను ధోనిని అడిగాను. కోపం ఎందుకు వ‌చ్చింద‌ని. నా ప్ర‌శ్న‌కు ధోని ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పాడు. నాకు అసలు కోపం రాదు, నాకు చివరిగా కోపం వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది. ఎప్పుడో రంజీ ఆడే రోజుల్లో కోపం వ‌చ్చేద‌ని, ఫీల్డ్‌లో సాధారణంగా అరుస్తూ ఉంటాను కానీ అది కోపం కాదు’ అని ధోని త‌న‌తో చెప్పాడ‌ని కుల్దీప్ తెలిపాడు.

Next Story
Share it