Dream Astrology : నిద్రలో ఈ కలలు వస్తే 'ధనవంతులు' అవుతారట..!
కలలు మన జీవితాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ కలలు కొన్నిసార్లు మంచివి.. కొన్నిసార్లు చెడ్డవి వస్తుంటాయి. మంచి కలలు హృదయానికి ప్రశాంతనిస్తాయి.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 2:00 PM GMTకలలు మన జీవితాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ కలలు కొన్నిసార్లు మంచివి.. కొన్నిసార్లు చెడ్డవి వస్తుంటాయి. మంచి కలలు హృదయానికి ప్రశాంతనిస్తాయి. మంచి కలలు కన్న రోజు ప్రజలు సంతోషంగా ఉంటారు. చెడు కలలు వచ్చిన రోజు భయపడుతుంటారు. తమ జీవితంలో ఏదో చెడు జరగబోతోందని వారు భావిస్తుంటారు. అయితే.. భయానక కలలు భవిష్యత్తు జీవితానికి హాని కలిగించవు. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని కలలు లక్ష్మీ దేవి రాకకు సంకేతాలుగా పేర్కొంటారు. మీరు కలలో ఈ కల కంటే త్వరలో ధనవంతులు కాబోతున్నారని చెబుతుంటారు.
మీకు కలలో అశోక వృక్షం కనిపిస్తే.. రాబోయే కాలంలో లక్ష్మీ దేవి విశేష ఆశీర్వాదాలు మీపై కురవబోతున్నాయనడానికి సంకేతం. ఆమె అనుగ్రహంతో ధన సంబంధిత సమస్యలు దూరమవుతాయి. సరళంగా చెప్పాలంటే లక్ష్మీ దేవి మీ ఇంటికి చేరుకుంటుంది. కలలో అశోక ఆకులను చూడటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ కలలు సంపద వస్టుందనటానికి సంకేతంగా చెబుతారు.
కలలో కాలినడకన నడవడం కూడా శ్రేయస్కరమని డ్రీమ్ సైన్స్ నిపుణుల అభిప్రాయం. ఈ కల అంటే మీరు పదోన్నతి పొందబోతున్నారని అర్థం. వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధి ఉండవచ్చు. దీనితో పాటు.. నడక కొత్త పనిని ప్రారంభించటానికి సంకేతం. మీరు త్వరలో ధనవంతులు అవుతారని ఈ కల సూచిస్తుంది.
కలలో పూజా మందిరంలో ఉన్న దేవత లేదా అలాంటి ఫోటోను చూడటం చాలా శుభప్రదం. లక్ష్మీ దేవి మీకు ప్రసన్నమయ్యిందని అర్థం. ఆమె ఆశీస్సులు మీపై కురుస్తాయి. లక్ష్మి మాత అనుగ్రహంతో మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. దీనితో పాటు డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
మీకు కలలో తెల్ల చీమలు కనిపిస్తే.. మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఈ కలలు సంపద సాధించడానికి సంకేతాలు. తెల్ల చీమలు కలలోకి రావడం చాలా అరుదు. అదృష్టవంతులు మాత్రమే కలలో తెల్ల చీమలను చూస్తారు.
కలలో బల్లిని చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కల కారణంగా వ్యాపారంలో పెరుగుదల ఉంటుందని చెబుతుంటారు. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సంపదను పొందే యాదృచ్చిక ఘటనలు అనేక విధాలుగా వస్తుంటాయి. వీటిలో పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి.
గమనిక : ఈ కథనంలో పేర్కొన్న నివారణలు/ప్రయోజనాలు/సలహాలు, ప్రకటనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. న్యూస్ మీటర్ ఈ ఆర్టికల్ ఫీచర్‌లో ఇక్కడ వ్రాసిన వాటిని ఆమోదించలేదు. ఈ వ్యాసంలో ఉన్న సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ప్రబోధాలు/నమ్మకాలు/గ్రంధాలు/పురాణాల నుండి సేకరించబడింది. కథనాన్ని అంతిమ సత్యంగా పరిగణించవద్దని విన్నపం. న్యూస్ మీటర్ మూఢ నమ్మకాలకు వ్యతిరేకం.