ముక్కనుమ.. మహిళలు నేడు సావిత్రి గౌరీ వ్రతం ఆచరిస్తే?
ముక్కనుమ సందర్భంగా నూతన వధువులు నేడు సావిత్రి గౌరీ వ్రతం ఆచరిస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
By - అంజి |
ముక్కనుమ.. మహిళలు నేడు సావిత్రి గౌరీ వ్రతం ఆచరిస్తే?
ముక్కనుమ సందర్భంగా నూతన వధువులు నేడు సావిత్రి గౌరీ వ్రతం ఆచరిస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ వ్రతం చేసిన వివాహితలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు ఈ పూజలో పాల్గొంటే సద్గుణాల భర్త లభిస్తాడు. ఈ వ్రతం కుటుంబంలో సుఖశాంతులను ఐశ్యర్యాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతున్నారు.
సావిత్రి గౌరీ వ్రతం
మట్టితో చేసిన దేవతా మూర్తుల బొమ్మలను ఓ పీఠంపై ఉంచి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజించాలి. నూతన వధువులు ఈ వ్రతాన్ని వరుసగా 9 రోజుల పాటు భక్తితో ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. రోజూ అమ్మవారికి 9 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. తొమ్మిదో రోజూ పూజ పూర్తయ్యాక, ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేయాలి.
సావిత్రి గౌరీ వత్రం, బొమ్మల నోము ముత్తయిదువులే కాకుండా.. పెళ్లికాని ఆడపిల్లలకు కూడా ఎంతో ముఖ్యమైనది. వారు ఈ నోము నోచుకోవడం వల్ల పార్వతీ దేవీకి శివుడు లభించినట్టుగా, తమకు కూడా సద్గుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు. పూజా సమయంలో గౌరీ కల్యాణం వంటి పవిత్ర గాథలను చదువుకోవడం వల్ల మనసు నిర్మలమవుతుంది.
సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత.