తిరుమల శ్రీవారి వక్ష స్థలంలో 'వ్యూహ లక్ష్మి' కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు. తిరుమల వెళ్లి వ్యూహ లక్ష్మిని దర్శించుకున్నా, ఇంట్లో వ్యూహలక్ష్మిని పూజించినా అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాల లభిస్తాయని నమ్మకం. శ్రీవారి మూల విరాట్టుపై అమ్మవారు ఎప్పుడూ పసుపు అచ్చుతో కప్పబడి ఉంటారు. ఆ పసుపును మనం ప్రసాదంగా పొందవచ్చు.
శ్రీవారి హృదయస్థానంలో వెలసని వ్యూహ లక్ష్మి అమ్మవారిని పసుపు ముద్రతో అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత, తొలగించిన పాత పసుపును భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీ వారి ప్రత్యేక సేవల్లో, అభిషేకంలో పాల్గొనే భక్తులకు ఈ పవిత్ర పసుపు లభిస్తుంది. ఈ ప్రసాదం పొందిన వారికి సిరిసంపదలకు లోటు ఉండదని విశ్వాసం. వ్యూహ లక్ష్మి అమ్మవారికి 3 భూజాలు ఉండటం వల్ల త్రిభుజ అని కూడా పిలుస్తారు.
తిరుమలలో వ్యూహ లక్ష్మి దర్శన భాగ్యం అందరికీ దక్కదు. శ్రీవారిని గురు, శుక్ర వారాల్లో దర్శనం చేసుకునే వారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. గురువారం నాడు శ్రీవారి అభరణాలు తొలగిస్తారు. అప్పుడు అమ్మవారిని నేరుగా చూడవచ్చు. మొదటి గడప దర్శనం అవకాశం దొరికిన వారికి వ్యూహలక్ష్మి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజు అభిషేకం, నిజపాద దర్శనంలో అమ్మవారి పసుపు ముద్రను దర్శించుకోవచ్చు.