అమరావతి: దేవీపట్నం బోటు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బాధ్యత వహిస్తూ ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది ఏపీ ప్రభుత్వం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నష్ట పరిహారం చెల్లించారు.  సెప్టెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో  బోటు మునిగి 30 మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే.

Devipatnam

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.