టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి దేవినేని అవినాష్?
By Medi Samrat Published on 13 Nov 2019 7:04 PM ISTగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ మరువకముందే.. కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అవినాష్.. టీడీపీ ఇసుక దీక్షకు ముందే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది.
పార్టీ మారే విషయమై ఇప్పటికే అవినాష్.. గుణదలలోని స్వగృహంలో దేవినేని నెహ్రూ అనుచరులు, అభిమానులతో భేటీ అయినట్టు సమాచారం. ఈ భేటీలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులు వైసీపీలోకి వెళ్లాలని అవినాష్ కు సూచించినట్టు తెలుస్తుంది.
అలాగే.. టీడీపీలో నెహ్రూ అభిమానులకు సరైన గుర్తింపు లేదని అవినాష్ ఎదుట కార్యకర్తలు వాపోయారని.. అంతేకాకుండా టీడీపీలో అవినాష్ కు కూడా సరైన ప్రాధాన్యత లేదని కార్యకర్తల ఆక్రోశం వెళ్లగక్కారని తెలుస్తుంది. అభిమానుల ఒత్తిడి మేరకు అవినాష్ వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో అవినాష్ వైసీపీలో చేరనున్నట్టు బెజవాడ రాజకీయ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయ్.