భార్యకు ఎత్తు ప‌ళ్లు ఉన్నాయంటూ పెళ్ల‌యిన‌ నాలుగు నెలల్లోనే భర్త ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ బాధితురాలు హ్యాపీగా ఉండాలని ఉచితంగా ట్రీట్‌మెంట్ చేయ‌డానికి ఓ ఆసుప‌త్రి ముందుకొచ్చింది. వివ‌రాళ్లోకెళితే.. కుషాయిగూడ చెందిన మహ్మద్‌ దస్తగిరి, షమీం దంపతుల చిన్న కుమార్తె వివాహం రుక్సానా బేగం వివాహం రాజేంద్రనగర్‌ అసద్‌నగర్‌ వాసి మహ్మద్‌ ముస్తాఫాతో ఈ ఏడాది జూన్‌ 27న జరిగింది. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది.

అయితే.. రుక్సానా బేగం పళ్లు ఎత్తుగా ఉండడంతో ఆమెను వేధింపులకు గురి చేసి నవంబర్‌ ఒకటో తేదీన ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు మహ్మద్‌. ఈ విష‌య‌మై అప్ప‌ట్లో వ‌రుస‌ వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి. చేసేదేం లేక రుక్సానా కూడా త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌నే ఉంటుంది. అయితే.. రుక్సానా బేగం అందరిలా సంతోష‌క‌ర‌మైన‌ జీవితం గడపాలనే ఉద్దేశంతోనే ఆమె ఎత్తు పళ్ల‌ను సరిచేసే ఉచిత ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఆలూక్స్‌ డెంటల్‌ హాస్పిటల్‌ వర్గాలు ముందుకు వచ్చాయి.

ఈ సంధ‌ర్బంగా ఆలూక్స్‌ డెంటల్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ నడా మీర్‌ మాట్లాడుతూ.. ఎత్తు పళ్ల‌ కారణంగా భర్త విడాకులు ఇచ్చాడని వార్తా పత్రికల్లో చదివాం. దీంతో ఆమెకు సహాయం చేసేందుకు తాము ముందుకు వచ్చాం. రుక్సానాను పరీక్షించిన తర్వాత ఆమెకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమో నిర్ధారిస్తామని ఆమె తెలిపారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.