పోలీసులకు చిక్కిన ఢిల్లీ షారుక్

By అంజి  Published on  4 March 2020 3:03 AM GMT
పోలీసులకు చిక్కిన ఢిల్లీ షారుక్

ఢిల్లీ అల్లర్లలో తుపాకీతో కాల్పులు జరిపిన షారూక్ ఖాన్ ను యూపీకి చెందిన క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు అతనికి గన్ ఎలా వచ్చింది. ఈ అల్లర్ల వెనక ఉన్న కుట్రపై విచారణ జరుపుతున్నారు.

మౌజ్‌పూర్‌లో చోటు చేసుకున్న అల్లర్ల సమయంలో షారూక్ ఖాన్ సుమారు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుగానే ధైర్యంగా తుపాకీ ఎక్కుపెట్టి ఈ చర్యకు పాల్పడ్డాడు. దీంతో అతని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి అతడు పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చివరకు సంఘటన జరిగిన 8 రోజుల తరువాత అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో అతన్ని పట్టుకున్నారు.

సంఘటన జరిగిన తర్వాత షారూక్ కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. షారూక్ ఖాన్ ఇంట్లో పలు అనుమానాస్పద వస్తువులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. పాలిథీన్ కవర్లో పేలుడు పదార్థాలు కూడా కనిపించాయని చెప్పారు. కాగా షారూక్‌ ఖాన్ తండ్రి మాదకద్రవ్యాల రావాణాలో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొంత కాలం అతడు జైల్లో ఉండి ఇటీవల బయటకు వచ్చాడు.

Delhi riots..Police arrested Shahrukh khan

పోలీసులు షారూక్ ఫోన్ ను ట్రాక్ చేశారు దాంతో అతను ఢిల్లీలోని మౌజ్ పూర్ నుంచి పానీపట్టు వెళ్లినట్లు తేలింది. అప్పటి నుంచి అతను ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో గల కైరానా, అమ్రోహా వంటి నగరాల్లో తలదాచుకుంటూ చివరికి పోలీసులకు చిక్కాడు..

Next Story