ట్రంప్ బస చేసే హోటల్ ప్రత్యేకతలు ఇవే

By సుభాష్
Published on : 24 Feb 2020 6:50 PM IST

ట్రంప్ బస చేసే హోటల్ ప్రత్యేకతలు ఇవే

అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ ఈరోజు భారత్‌ గడ్డపై అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు పర్యటించే ట్రంప్‌ దంపతులు రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్నారు. ఈ హోటల్‌లో బస చేయనుండటంతో సెక్యూరిటీ అంతా ఇంతాకాదు. ఈ ఐటీసీ మౌర్య హోటల్లో చాణక్య ప్రెసిడెన్షియల్ సూట్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. అన్నీ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉండే హోటల్‌ ఇది. అంతేకాదు ట్రంప్‌ బస చేయడమంటే మామూలు విషయం కాదు. హోటల్లో కూడా గాలి నాణ్యత కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మేరకు ఉండాలి. అయితే ఇండియాలో ఇలాంటి హోటల్‌ కేవలం ఢిల్లీలో ఐటీసీ మౌర్య హోటల్‌ మాత్రమే. అందుకే ట్రంప్‌ ఇక్కడే బస చేయనున్నారు.

ఈ హోటల్‌ 446 చదరపు అడుగులు ఉంటుంది. ఈ హోటల్‌ 14 అంతస్తులు ఉంటుంది. గతంలో భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా కూడా ఇదే సూట్‌లో హోటల్‌లో చేశారు. ఈ హోటల్‌లో బస చేయడం ట్రంప్‌ నాలుగో అధ్యక్షుడు. ఇప్పటికే ఈ హోటల్‌ను ట్రంప్‌ భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ హోటల్‌కు ఎన్నో ప్రత్యేకతలు

ఈ ఐటీసీ మౌర్య హోటల్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ ఏది చూసినా గ్రాండ్‌గా ఉంటుంది. ఇందులోనెమలిథీమ్‌ లో ఉండే 12 సీట్ల ప్రైవేటు డైనింగ్‌ రూమ్‌, ముత్యాలతో పొదిగిన సామాగ్రితో కూడిన బాత్‌ రూమ్‌, మినీ స్పా, జిమ్‌, అలాగే ఈ హోటల్‌ సూట్‌కు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ గ్లాస్‌లు ఏర్పాటు చేశారు. సూట్‌ నుంచి నేరుగా హోటల్‌కు, పార్కింగ్‌ ఏరియాకు వెళ్లేందుకు ప్రత్యేకమైన దారి ఉంటుంది. హైస్పీడ్‌ ఎలివేటర్‌ కూడా ఉంది. ప్రసిడెన్షియల్‌ సూట్‌లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రమాణాల ప్రకారం స్వచ్ఛమైన గాలి ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే ఈ సూట్‌కు ఎదురుగా మరో సూట్‌ను ఇవాంకకు కేటాయిచారు. ట్రంప్‌ కూతురు ఇవాంక, అల్లుడు కుష్నల్‌ ఇదే హోటల్‌లో బస చేస్తారు. వీరి కోసం వివిధ రకాలుగా లగ్జరీ సూట్లు సిద్ధంగా ఉన్నాయి.

అయితే వీరిని ఎక్కడ ఉంచాలనేది 'సీక్రెట్‌ సర్వీస్‌' తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా, ట్రంప్‌ ఉండే సూట్‌ చాలా ఖరీదనే చెప్పాలి. ఒక్క రాత్రికి రూ. 8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం అమెరికా అధ్యక్షులే కాదు.. గతంలో చాలా మంది ప్రముఖులు ఈ సూట్‌లో బస చేశారు. దలైలామా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, కింగ్‌ అబ్దుల్లా, బ్రూనై సుల్తాన్‌ కూడా బస చేసిన చరిత్ర ఈ హోటల్‌కు ఉంది. అంతేకాదు ఈ హోటల్లో ట్రంప్‌కు స్వాగతం పకలనున్నారు. బయో డిగ్రేడబుల్‌ పుష్పాలను ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఉపయోగిస్తున్నారు. అది కూడా భారతీయ సంప్రదాయం ప్రకారంమే స్వాగతం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story