డిల్లీలో దారుణం.. ట్రైన్ ఎక్కిస్తామ‌ని న‌మ్మించి.. యువతి‌పై ముగ్గురు అత్యాచారం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 3:18 PM IST
డిల్లీలో దారుణం.. ట్రైన్ ఎక్కిస్తామ‌ని న‌మ్మించి.. యువతి‌పై ముగ్గురు అత్యాచారం

దేశ రాజధాని డిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పదహారేళ్ల యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. జార్ఖండ్‌కు చెందిన బాధితురాలు నగరంలోని ఓ ఇంట్లో పనిచేస్తుంది. అయితే తన సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు వెళ్లేందుకు ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు.. అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

అయితే అక్కడి నుంచి జార్ఖండ్‌కు వెళ్లేందుకు ఎలా వెళ్లాలో తెలియ‌క ఆ యువ‌తి అయోమ‌యంలో ఉండ‌గా.. ఆమె అమాయకత్వాన్ని గమ‌నించిన‌ ముగ్గురు కామాంధులు.. ఆమెతో మాటలు కలిపి జార్ఖండ్‌ ట్రైన్ ఎక్కిస్తామని చెప్పి.. మెల్లిగా ఆ యువ‌తిని వారి వెంట తీసుకెళ్లారు. జార్ఖండ్‌కు వెళ్లాల్సిన స్టేష‌న్‌ మరో రైల్వే స్టేషన్‌ అనుకున్న ఆ అమ్మాయి వారిని న‌మ్మి వెళ్లగా.. ఆమెను జ‌నావాసాల‌కు దూరంగా తీసుకెళ్లి.. బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత.. ఆమెపై ఆ ముగ్గురు యువకులు కామ‌వాంఛ తీర్చుకున్నారు.

ఆ త‌ర్వాత‌ యువతిని రోడ్డుపై వదిలి ఆ యువ‌కులు పారిపోయారు. అయితే మద్యం మత్తులో తూలుతూ ఉన్న బాధిత యువ‌తిని గమనించిన పోలీసులు విచారించారు. మహిళా పోలీసులు ప్రత్యేకంగా అడగ్గా.. తనపై అత్చాచారం జరిగిన విషయాన్ని వెల్ల‌డించింది. మ‌ద్యం మ‌త్తులో ఉండంటం చేత ఆ అఘాయిత్యం ఎక్కడ జరిగిందన్న విషయం అమ్మాయి గుర్తించకపోవడంతో.. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిని చైల్డ్‌ వెల్పేరన్ కమిటీకి అప్పగించారు.

Next Story