Fact Check : బాబ్రీ మసీదుకు బదులుగా ఆసుపత్రి కట్టించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Aug 2020 1:13 AM GMT
Fact Check : బాబ్రీ మసీదుకు బదులుగా ఆసుపత్రి కట్టించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారా..?

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఎన్నో సంవత్సరాల బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదానికి ముగింపు కలిగిందని అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

అస్సాం రాష్ట్రం లోని సోనిత్పూర్ జిల్లాలో 12 మంది భజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడి జరిగింది. బైక్ లను, ఫోర్-వీలర్లను తగులబెట్టారు. ఈ అల్లర్లలో సోనిత్పూర్ డిప్యూటీ కమీషనర్ వాహనం కూడా దెబ్బతింది.

ఇలాంటి తరుణంలో బాబ్రీ మసీదుకు బదులుగా ఆసుపత్రి కట్టించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరినట్లుగా ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ వెలువడిందని.. ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ బాబ్రీ మసీదు స్థానంలో 5 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టించాలనుకుంటున్న ప్రపోజల్ ను తీసుకువస్తున్నామని తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన త్రీడీ ఇమేజ్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 5 ఎకరాల ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించవచ్చు అని ఆయన చెబుతున్నట్లుగా ఉన్న ట్వీట్ ను పలువురు పోస్టు చేస్తున్నారు.

ఈ పోస్టు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. 5000 మందికి పైగా పోస్ట్ ను లైక్ చేశారు. కొందరు ఆ అకౌంట్ ను అరవింద్ కేజ్రీవాల్ పేరడీ అకౌంట్ అని చెప్పగా.. మరికొందరు నిజమైన అకౌంట్ అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

బాబ్రీ మసీదుకు బదులుగా ఆసుపత్రి కట్టించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారన్న వైరల్ పోస్టు 'అబద్ధం'.

11

వైరల్ పోస్టుకు సంబందించిన ట్విట్టర్ అకౌంట్ ను వెతకగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన అఫీషియల్ అకౌంట్ కాదని స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్ పేరడీ అకౌంట్ అంటూ డిస్క్రిప్షన్ లో స్పష్టంగా తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా ఆయన ఆసుపత్రి ప్రపోజల్ తీసుకుని వచ్చినట్లుగా ఎటువంటి పోస్ట్ కూడా లేదు.

పేరడీ అకౌంట్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రొఫైల్ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు గమనించవచ్చు.

ఆగష్టు 6, 2020న అరవింద్ కేజ్రీవాల్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా ఆయన ఈ ట్వీట్ చేయలేదని స్పష్టమవుతోంది.

12

బాబ్రీ మసీదుకు బదులుగా ఆసుపత్రి కట్టించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారన్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Next Story