ఢిల్లీ: అనాజ్‌ మండీ అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 21 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల అనాజ్‌ మండీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది కార్మికులు మృతి చెందారు. అనాజ్‌మండీలో జరిగిన అగ్ని ప్రమాదం ఢిల్లీలో రెండో అతి పెద్ద ప్రమాద ఘటనగా అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లింది. అగ్నిమాపక సిబ్బంది 50 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఉదయం 5.30 ప్రాంతంలో ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగి అంతటా వ్యాపించాయి. అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరగడంతో అగ్నికి ఆహుతయ్యారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.