ఢిల్లీ: సగ ధరకే మద్యం.. భారీగా మద్యం ధరలు తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం
By సుభాష్ Published on 7 Jun 2020 3:38 PM ISTమద్యం ప్రియులకు మంచి శుభవార్త చెప్పింది ఢిల్లీ ప్రభుత్వం. కరోనా సేవల కోసమని ఢిల్లీ ప్రభుత్వం మద్యం ఎమ్మార్పీపై విధిస్తున్న 70 శాతం అదనపు ప్రత్యేక కరోనా పన్నును ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 10వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఢిల్లీ ప్రభుత్వం మద్యంపై భారీగా ఈ పన్ను విధించడంతో మందుబాబులకు జేబుకు చిల్లలు పడినట్లయింది. ఎమ్మార్పీ కంటే అధిక శాతం డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నిర్ణయంతో దాదాపు సగం ధరకే మద్యం లభించే అవకాశం వచ్చింది ఢిల్లీ ప్రజలకు.
(ఇది చదవండి: ఇక కరోనా సోకితే ఇలా చేయండి.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు)
కాగా, ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉండటంతో మే 5వ తేదీన కేజ్రీవాల్ సర్కార్ ఈ కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. ఎమ్మార్పీపై ఏకంగా 70శాతం అధిక మొత్తం వసూలు చేయడంతో మద్యం ప్రియులకు తాగినా కిక్కెక్కని పరిస్థితి దారుపురించింది. ఇక మద్యం బాబులకు ఇంత భారీ మొత్తంలో భారం కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ధరలను తగ్గించాలంటూ తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ప్రభుత్వం విధించిన ట్యాక్స్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదర్శంతా తీసుకుని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా మద్యం ధరలను పెంచాయి. కొత్త ట్యాక్స్ లు వేశాయి. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తగ్గించినట్లుగానే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పెంచిన మద్యం ధరలను తగ్గిస్తే బాగుండని తెలుగు రాష్ట్రాల మద్యం ప్రియులు కోరుతున్నారు.