సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించిన ఇండోసోల్ సోలార్
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు సగర్వంగా వెల్లడించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 March 2024 11:45 AM GMTహైదరాబాద్ మార్చి 26 2024: - షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు సగర్వంగా వెల్లడించింది. జనవరి 2024లో కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలంలో ఈ ఉత్పత్తి లైన్ నిర్మించబడింది.
ఈ ముఖ్యమైన మైలురాయిపై సీఈఓ శ్రీ శరత్ చంద్ర మాట్లాడుతూ, “మేము 500 MW సోలార్ PV మాడ్యూల్ ఉత్పత్తిని మార్చి 31 నుండి ప్రారంభిస్తున్నాము. ఇది అత్యాధునిక, పూర్తి ఆటోమేటెడ్ మాడ్యూల్ లైన్, భారతదేశంలోనే ఈ తరహా సదుపాయాలలో మొట్టమొదటిది; PERC,TOPCON, మరియు గ్లాస్-గ్లాస్ మరియు గ్లాస్-బ్యాక్‌షీట్ కాంబినేషన్‌తో HJT మాడ్యూల్ లు తయారు చేయగలదు" అని అన్నారు.
దేశీయ తయారీ సామర్థ్యాలను పెంపొందించడంతో పాటుగా పర్యావరణ అనుకూల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకంతో ఈ కార్యక్రమం సమలేఖనం చేయబడింది. భారతదేశ పునరుత్పాదక ఇంధన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో దాని కీలక పాత్రను ధృవీకరిస్తూ, PLI పథకం కింద ప్రోత్సాహకాలు ఇండోసోల్ సోలార్‌కు లభించాయి.
భారతదేశపు అతిపెద్ద ట్రాన్స్‌ఫార్మర్ తయారీదారు SSEL ద్వారా స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)గా, ఇండోసోల్ సోలార్ స్థాపించబడింది. భారతదేశ పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగును ఇది సూచిస్తుంది. వచ్చే నెలలో తమ 30 సంవత్సరాల శ్రేష్ఠత తో కూడిన కార్యకలాపాలను పూర్తిచేసే దాని మాతృ సంస్థ SSEL ద్వారా వేయబడిన బలమైన పునాది పై ఆధారపడి ఇండోసోల్ సోలార్ , సౌరశక్తి రంగం కోసం భారతదేశం యొక్క లక్ష్యాలను సాధించే దిశగా కార్యకలాపాలను ప్రారంభించే మొదటి ప్రాజెక్ట్‌గా ఉద్భవించింది.
SSEL యొక్క బలాలను గురించి శ్రీ చంద్ర వివరిస్తూ, "ఈరోజు, SSEL దాదాపు 30 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భారతదేశపు అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ మరియు పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ల తయారీదారుగా నిలిచింది. కడపలో మా అత్యాధునిక తయారీ కేంద్రం రోజు కి 500కి పైగా ట్రాన్స్‌ఫార్మర్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత పట్ల మా నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది" అని అన్నారు .
SSEL యొక్క విశేషమైన వృద్ధి పథంలో, ఇండోసోల్ సోలార్ నిర్మించడం, వ్యూహాత్మక విలీనాలు మరియు పెట్టుబడులతో సౌరశక్తిలో వైవిధ్యతను స్వీకరిస్తుంది. సోలార్ మాడ్యూల్ తయారీ రంగం లో కంపెనీ ప్రవేశించడం భారతదేశ పునరుత్పాదక ఇంధన భవిష్యత్తుకు సహకరించాలనే దాని దృక్పథానికి నిదర్శనం.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన , శ్రీ చంద్ర మాట్లాడుతూ , "PLI పథకం క్రింద ప్రతిష్టాత్మకమైన బిడ్‌ను గెలుచుకోవడం, దిగుమతి చేసుకున్న సాంకేతికతపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. మా సోలార్ తయారీ సామర్థ్యాలు వేగవంతం చేయడానికి మరియు 'మేక్-ఇన్-ఇండియా' , 'ఆత్మనిర్భర్ భారత్' జాతీయ ఎజెండాకు అనుగుణంగా ఉండేందుకు మాకు ఒక ముఖ్యమైన వేదికను PLI పథకం అందించింది" అని అన్నారు.
శ్రీ చంద్ర ప్రాజెక్ట్ ఈ యొక్క ఆర్థిక ప్రభావాన్ని వెల్లడిస్తూ "మా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి కార్యకలాపాలను సాధించిన తర్వాత, ఇండోసోల్ సోలార్ 100,000 మంది వరకు ప్రజలపై సానుకూల ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది, అదే సమయంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మంది కి ఉపాధిని సృష్టిస్తుంది.
ఇండోసోల్ సోలార్, దేశీయ తయారీని ప్రోత్సహించడం మరియు ఇంధన స్వయం సమృద్ధిని సాధించడం పట్ల ప్రభుత్వ మద్దతును ప్రదర్శిస్తూ PLI పథకం కింద గణనీయమైన కేటాయింపులను పొందింది. ట్రాంచ్ 2 కింద అత్యధిక PLI మొత్తాన్ని పొందడంలో కంపెనీ విజయం సాధించడం దాని సాంకేతిక మరియు ఆర్థిక సామర్థ్యాలకు నిదర్శనం.
దాని అత్యాధునిక సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంతో, ఇండోసోల్ సోలార్ , సౌర శక్తి రంగంలో ఆవిష్కరణ మరియు సస్టైనబిలిటీ కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. అధునాతన సాంకేతికత మరియు ఆటోమేషన్ సౌకర్యాలు కలిగిన ఈ సదుపాయం, అత్యుత్తమ నాణ్యమైన సౌర ఉత్పత్తులను అందించడంలో కంపెనీ నిబద్ధతను నొక్కి చెబుతుంది.
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని విస్తరించే దిశగా తన ప్రయాణాన్ని, ఇండోసోల్ సోలార్ ప్రారంభించినప్పుడు, సానుకూల ఆర్థిక ప్రభావాలను సృష్టించడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడటం వంటి దాని లక్ష్యంలో ఇది స్థిరంగా ఉంది.