డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020.. లక్నోలో హైఅలర్ట్‌..

By అంజి  Published on  5 Feb 2020 6:20 AM GMT
డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020.. లక్నోలో హైఅలర్ట్‌..

ఉత్తరప్రదేశ్‌: ఇవాల లక్నోలో డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020 ప్రారంభంకానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్రరక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ డిఫెన్స్‌ ఎక్స్‌పోలో 35 దేశాలకు చెందిన రక్షణశాఖ మంత్రులు, 54 దేశాలకు మిలటరీ చీఫ్‌లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయుధాల తయారీదారులు పాల్గొంటారు. డిఫెన్స్‌ ఎక్స్‌పో సమయంలో యుద్ధ విమానాలు గంటకు 2,700 కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లక్నోలో ఇప్పటికే హైఅలర్ట్‌ను ప్రకటించారు. ప్రదర్శనలో వెయ్యి మంది దేశ, విదేశాలకు చెందిన ఆయుధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.

వెయ్యికి పైగా కంపెనీలో ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నాయని ఏఐఆర్‌ కరస్పాండెంట్‌ నివేదిక తెలిపింది. డిఫెన్స్‌ ఎక్స్‌పో సందర్భంగా యూపీ ప్రభుత్వం పలు సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. డిఫెన్స్ ఎక్స్‌పో 2020 నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ రకమైన అతిపెద్ద మెగా డిఫెన్స్‌ ఎగ్జిబిషన్‌ మొదటిసారిగా లక్నోలో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్‌లో భారత్‌, విదేశాలకు చెందిన రక్షణ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. డిఫెన్స్‌ ఎక్స్‌ పో ద్వారా కొత్త టెక్నాలజీలతో పాటు సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు లభించనున్నాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద డిఫెన్స్‌ ఎక్స్‌పోగా నిలిచింది. భారత్‌-ఆఫ్రికా రక్షణ మంత్రుల మధ్య మొదటిసారిగా కాన్‌క్లేవ్‌ నిర్వహించబడుతోంది. ఇందులో 30కిపైగా ఆఫ్రికా దేశాలు పాల్గొంటాయి.

Next Story