క్షీణించిన ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

By సుభాష్  Published on  19 Aug 2020 12:48 PM IST
క్షీణించిన ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షిణించింది. తాజాగా ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫెరల్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రణబ్‌ ముఖర్జీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రత్యేక వైద్య బృందం ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. దీనిపై ఆర్మీ ఆస్పత్రి తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కాగా, అంతకు ముందు ప్రణబ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ వెల్లడించారు. వైద్యుల నిరంతరం కృషి వల్ల ప్రణబ్‌ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిజిత్‌ ముఖర్జీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

Next Story