Fact Check : కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా దళిత యువతిని హైదరాబాద్ లో చంపేశారంటూ పోస్టులు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 8:59 AM IST
Fact Check : కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా దళిత యువతిని హైదరాబాద్ లో చంపేశారంటూ పోస్టులు..?

ఓ యువతి శవాన్ని ఇంట్లోని బయటకు తీసుకుని వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెడుతూ ఉన్నారు.



“Dalit Girl R**** Raped & K!lled by Sayyed Mustafa in Hyderabad, Body Recovered from Mustafa’s Home. Hey @DeepikaSRajawat. do you have the courage to post one meme on this? #ShamelessDeepika,” అంటూ ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తూ ఉన్నారు.



రాధిక అనే దళిత యువతిని హైదరాబాద్ లో చంపేశారు.. సయ్యద్ ముస్తఫా అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.. ముస్తఫా ఇంటి నుండి శవాన్ని బయటకు తీసుకుని వస్తున్న దృశ్యాలు ఇవి అంటూ పలువురు వీడియోలను సామజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

ఈ పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన దళిత యువతి బాయ్ ఫ్రెండ్ చేతిలో చంపడింది. అక్టోబర్ 17, 2020న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో కుల మతాల కోణం లేదు.

“Dalit girl R**** raped and killed” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. పలు వార్తా కథనాలు లభించాయి. ‘R**** was killed by her boyfriend Syed Mustafa @ Ayan on Oct 17 in Hyderabad. This is her body being recovered from the accused’s house. She was from SC caste.’ అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి.

ఆ యువతి మృతదేహాన్ని సయ్యద్ ముస్తఫా ఇంటి నుండి రికవర్ చేయడం జరిగింది. IPC సెక్షన్లు 417, 420 (చీటింగ్) కింద అతడి మీద కేసును బుక్ చేయడం జరిగింది.



Swarajyamag కథనం ప్రకారం.. సదరు యువతి మహాత్మా గాంధీ లా కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆ యువతి సోదరుడు మాట్లాడుతూ తన సోదరి ముస్తఫాను కలవడానికి వెళ్లిందని.. ముస్తఫా, అతడి సోదరుడు కలిసి చెంపేశారని వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం యువతి తల్లి ముస్లిం, తండ్రి రాజ్ కుమార్ హిందూ. తమ కుటుంబం క్రిస్టియానిటీని స్వీకరించింది అని వెల్లడించారు.

నిందితుల మీద పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. అలాగే ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి తరలించారు. పోలీసులు ఈ హత్య గురించి అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు.

రాధిక-ముస్తఫాల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఈ హత్య చోటు చేసుకుందని.. రాధిక తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతోనే ఈ హత్య చోటు చేసుకుందని చెబుతూ ఉన్నారు. దీనికి మతం రంగు పూయాలని కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తూ ఉన్నాయి.

Claim Review:Fact Check : కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా దళిత యువతిని హైదరాబాద్ లో చంపేశారంటూ పోస్టులు..?
Claim Reviewed By:Satya Priya
Claim Fact Check:false
Next Story