Fact Check : అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2020 1:16 PM GMT
Fact Check : అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారా..?

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే..! భారత సంతతి ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద పెద్ద హామీలనే ఇస్తూ ఉన్నారు. ట్రంప్, బైడెన్ ఇద్దరూ తాము భారత్ కు సన్నిహితులమని చెబుతూ ఉన్నారు. ఇటీవలే తెలుగు భాష గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. బ్యాలట్ పేపర్ లో తెలుగు ఉన్న ఫోటో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన బ్యాలట్ పేపర్లలో తెలుగును ఉంచారంటూ పోస్టులు పెట్టారు.



తెలుగు భాషను అమెరికా ప్రభుత్వం అధికారిక భాషగా గుర్తించిందని, అమెరికా బ్యాలెట్ పేపర్‌పై తెలుగు భాష ఉందంటూ కథనాన్ని ప్రచురించారు. Hans India లో అక్టోబర్ 19న ప్రచురించిన కథనం ప్రకారం 'డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెలుగును అధికారిక భాషగా గుర్తించింది. తెలుగు ప్రజలంతా ఈ విషయాన్ని పండుగలా జరుపుకోవాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో బ్యాలట్ పేపర్ మీద వివిధ భాషల్లో సమాచారాన్ని ముద్రించారు'.

నిజ నిర్ధారణ:

అమెరికా ఎన్నికల ఓటింగ్ సందర్భంగా బ్యాలట్ పేపర్ మీద తెలుగులో ముద్రించిన సంగతి నిజమే.. కానీ అమెరికాలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించారు అన్న కథనంలో ఎటువంటి నిజం లేదు.

తెలుగుతో పాటూ బ్యాలట్ పేపర్ మీద మరెన్నో భాషలను ముద్రించారు. ఎన్నికల సమయంలో అందరికీ అర్థమయ్యే విధంగా బ్యాలట్ పేపర్లను తీసుకుని వచ్చారు. అంతేకానీ తెలుగును అధికారిక భాషగా ప్రకటించారు అన్న కథనంలో ఎటువంటి నిజం లేదు. అమెరికాకు ఎలాంటి అధికారిక భాష కూడా లేదు.

CNN.com కూడా అమెరికాకు అధికారిక భాష లేదని గతంలో ఓ ఆర్టికల్ ద్వారా చెప్పుకొచ్చింది. “A lot of multilingual countries promote an official language, but the United States has never done so with English. In fact, the US has no official language.” అమెరికాలో వివిధ భాషలకు చెందిన వారు ఉన్నారని.. ఇంగ్లీష్ ను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని.. కానీ అమెరికాకు అధికారిక భాష అన్నది లేదు. దీని మీద ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.

America.gov కథనం ప్రకారం అమెరికాలోని బ్యాలట్ పేపర్ల మీద వివిధ భాషల్లో నిబంధనలను, ఓటింగ్ విధానాలను తెలియజేసేలా ముద్రిస్తారని స్పష్టం చేసింది. కాలిఫోర్నియాలో ఓటర్లు బ్యాలట్ పేపర్ల మీద అరబిక్, ఆర్మేనియన్, హమాంగ్, కొరియన్, పర్షియన్, స్పానిష్, సిరియాక్, తగలాగ్.. మరిన్ని భాషలు ఉంటాయి.

కాలిఫోర్నియా, అలాస్కా రాష్ట్రాలలో ఓటింగ్ పాల్గొనే సమయంలో తెలుగు భాషను బ్యాలట్ పేపర్ల మీద వినియోగిస్తూ ఉన్నారు. శాంటాక్లారా కౌంటీలో కూడా బ్యాలట్ పేపర్ల మీద, ఓటర్ రిజిస్ట్రేషన్ పేపర్ల మీద తెలుగు భాషలో సూచనలు ఉంటాయి.

02

Center for Immigration Studies 2018లో చేసిన రీసర్చ్ ప్రకారం అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందట. 2017లో 400000 మంది దాకా అమెరికాలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని తెలిపారు. 2010 నుండి 2017 మధ్యన 86శాతం మంది పెరిగారట.

India Today, Factly కూడా అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారన్న కథనాలను ఖండించాయి.

అమెరికా ఎన్నికల ఓటింగ్ సందర్భంగా బ్యాలట్ పేపర్ మీద తెలుగులో ముద్రించిన సంగతి నిజమే.. కానీ అమెరికాలో తెలుగును అధికారిక భాషగా ప్రకటించారన్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Fact Check : అమెరికాలో తెలుగును అధికారిక భాషగా గుర్తించారా..?
Claim Reviewed By:Satya Priya
Claim Fact Check:false
Next Story