@Luv_Sinha143 అనే ట్విట్టర్ ఖాతా నుండి పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చాయి. వాటిలో చాలా వరకూ వివాదాస్పదమైనవే ఉన్నాయి. ఈ ట్వీట్లు చేస్తోంది బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా అని భావించారు. ఇటీవలే లవ్ సిన్హా.. యాక్టింగ్ ను వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు.

ఈ అకౌంట్ లో నుండి బయటకు వచ్చిన చాలా ట్వీట్లు వివాదాస్పదమైనవే.. నిజంగా లవ్ సిన్హా నే చేశాడని భావించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వచ్చారు.

హిందీలో ఉన్న ఈ ట్వీట్లలో కంగనా రనౌత్ ను కూడా టార్గెట్ చేయడం జరిగింది. 'కంగనా రనౌత్ హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెడుతోందని.. బాంబే హైకోర్టు కంగనా రనౌత్ మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేయాలని కోరింది. ఈ దేశం బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే నడుచుకుంటుంది.' అంటూ సంచలన ట్వీట్ ఆ అకౌంట్ నుండి పోస్టు చేశారు.

చాలా మంది దీన్ని నమ్మేసి లైక్స్, షేర్స్ చేయడం మొదలైంది.

నిజ నిర్ధారణ:

@Luv_Sinha143 అనే ట్విట్టర్ ఖాతా శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా అధికారిక ఖాతా కానే కాదు.

న్యూస్ మీటర్ లవ్ సిన్హా అధికారిక ఫేస్ బుక్ ఖాతాను చెక్ చేయగా అందులో అతడి బయోలో తన ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన సమాచారం ఉంది. @LuvSinha అన్నది అతడి అధికారిక ట్విట్టర్ ఖాతా.

@LuvSinha ట్విట్టర్ ఖాతాను డిసెంబర్ 2009లో క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ కు 34000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. @Luv_Sinha143 అకౌంట్ ని ఫిబ్రవరి 2019లో క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ కు 3700 మంది ఫాలోవర్లు ఉన్నారు.

బాలీవుడ్ నటుడు, లవ్ సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా @LuvSinha అనే అకౌంట్ ను ఫాలో అవుతూ ఉన్నారు. దీన్ని బట్టి @LuvSinha అన్నది అఫీషియల్ అకౌంట్ అని అర్థం అవుతోంది. @Luv_Sinha143 అన్నది అధికారిక ఖాతా కానే కాదు.

@Luv_Sinha143 ట్విట్టర్ ఖాతా నుండి చాలా మంది నటుల పేరడీ అకౌంట్లకు సంబంధించిన ట్వీట్స్ రీట్వీట్లు చేయడం జరిగింది. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్ లాంటి నటుల పేరడీ అకౌంట్ల ట్వీట్లను రీట్వీట్ చేయడం జరిగింది. మరి కొన్ని వివాదాస్పద ట్వీట్లు కూడా చేశారు. వీటికి లవ్ సిన్హాకు ఎటువంటి సంబంధం లేదు.

నటుడు లవ్ సిన్హా కు @Luv_Sinha143 అనే ట్విట్టర్ ఖాతాకు ఎటువంటి సంబంధం లేదు. లవ్ సిన్హా వివాదాస్పద ట్వీట్లు చేశారన్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review :   Fact Check : శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా వివాదాస్పద ట్వీట్లు చేశారా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story