ఇండోనేషియాలో ప్రమాదకర 'డీ614జీ' వైరస్‌.. కరోనా కంటే డేంజర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 3:01 PM GMT
ఇండోనేషియాలో ప్రమాదకర డీ614జీ వైరస్‌.. కరోనా కంటే డేంజర్‌

ఇండోనేషియాలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిపై విసృత్తంగా పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదకర డీ 614జీ వైరస్‌ బయటపడింది. మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) చెందిన ఈ వైరస్ ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్‌తో పోలిస్తే 10 రెట్ల తీవ్రత కలిగి ఉంది. గతంలో ఈ వైరస్‌ మలేసియాలోనూ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిని ఇండోనేషియాలో గుర్తించినట్లు జకర్తాలోని జకార్తాలోని ఐజక్ మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వెల్లడించంది. కాగా.. ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య పెరగడానికి ఈ వైరస్‌ కారణమా..? అని తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డిప్యూటీ డైరక్టర్‌ హెరవాతీ సుడోయో మీడియాకు వెల్లడించారు.

ఇక ఇదిలా ఉంటె కరోనా వైరస్ పరివర్తనం చెందిన డి614జీ వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరిలోనే గుర్తించింది. ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ దీని వలన మరణాలు పెరిగే అవకాశం తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటె ఇండోనేషియాలో ఇప్పటి వరకు 1,72,000కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 7300 మరణాలు సంభవించాయి. తీవ్రత ఇదే స్థాయిలో ఉంటె మరికొద్ది రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశోధకులు వెల్లడించారు.

Next Story