దావూద్‌ ఇబ్రహీంకు మా దేశంలో పౌరసత్వం లేదు

By సుభాష్  Published on  30 Aug 2020 9:46 AM GMT
దావూద్‌ ఇబ్రహీంకు మా దేశంలో పౌరసత్వం లేదు

అండర్‌ వరల్డ్‌ డాన్‌, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం లేదని కామన్‌వెల్త్‌ ఆఫ్‌ డొమినికా స్పష్టం చేసింది. దావూద్‌కు మా దేశ పాస్ట్‌ పోర్టు కూడా లేదని స్పష్టం చేసింది. దావూద్‌ దొమినికన్‌ పాస్‌పోర్టు కలిగివున్నట్లు వాస్తున్న వార్తలపై ఆ దేశం ఖండించింది. దావూద్‌కు తమ దేశంలో పౌరసత్వం లేదని, అంతేకాకుండా పెట్టుబడుల కార్యక్రమాల పేరుతో ఎలాంటి పౌరసత్వం ఇవ్వలేదని తేల్చి చెప్పింది.

పౌరసత్వం జారీలో నూతన విధానాలు

కాగా, దావూద్‌ పౌరసత్వంపై ఖండించిన డొమినికన్‌ దేశం.. పౌరసత్వం జారీ చేసే విషయంలో నిజాయితీతో కూడిన నూతన విధానాన్ని అనుసరిస్తున్నామని పేర్కొంది. దావూద్‌ ఇబ్రహీంపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.

కాగా, దావూద్‌ ఇబ్రహీం పలు పేర్లతో వివిధ దేశాల పాస్‌పోర్టులను కలిగివున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్‌, భారత్‌, దుబాయ్‌, కామన్‌వెల్త్‌ ఆఫ్ డొమినికా వంటి దేశాల అడ్రస్‌లతో పాస్‌పోర్టులు కలిగివున్నట్లు ఆరోపణలున్నాయి. వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డొమినికా క్లారిటీ ఇచ్చింది.

Next Story