కరోనా పై పోరుకు డీమార్ట్ భారీ విరాళం

By రాణి  Published on  7 April 2020 2:49 PM GMT
కరోనా పై పోరుకు డీమార్ట్ భారీ విరాళం

కరోనా మహమ్మారిపై పోరాటానికి టాటా గ్రూప్ సహా..పలు కంపెనీలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు స్వచ్ఛందంగా పీఎం కేర్స్ కు, ఆయా రాష్ట్రాల సీఎం సహాయనిధులకు విరాళాలందించారు. ఇప్పుడు డీ మార్ట్ కూడా తనవంతు సహాయాన్నందించేందుకు ముందుకొచ్చింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ తనవంతు సహాయంగా రూ.155 కోట్ల విరాళమివ్వనున్నట్లు ప్రకటించింది. వీటిలో రూ.100 కోట్లు పీఎం కేర్స్ కు, మిగతా రూ.55 కోట్లు కరోనా పీడిత రాష్ట్రాలకు అందించనున్నట్లు తెలిపింది.

Also Read : రేపటి నుంచి 14 వరకూ 32 రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

ఈ సందర్భంగా డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ మాట్లాడుతూ..భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ గడిచిన 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సమాజాన్ని కాపాడు కోవడానికి ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేయాలని సూచించారు. పీఎం కేర్స్‌కు రూ.100 కోట్లు ప్రకటించగా.. మహారాష్ట్ర, గుజరాత్‌లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.

Also Read :1000 కుటుంబాలకు చేయూతనందించిన గోపీచంద్

Next Story