రేపటి నుంచి 14 వరకూ 32 రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

By రాణి  Published on  7 April 2020 2:18 PM GMT
రేపటి నుంచి 14 వరకూ 32 రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

రేపటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ 34 పార్శిల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాకినాడ నుంచి సికింద్రాబాద్, రేణిగుంట నుంచి సికింద్రాబాద్ కు 34 ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు కేవలం నిత్యావసరాలను సరఫరా చేసేందుకు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. 8 నుంచి 12వ తేదీ వరకూ రేణిగుంట - నిజాముద్దీన్ 2 ప్రత్యేక పార్శిల్ రైళ్లు, 9న సికింద్రాబాద్ నుంచి హౌరాకు పార్శిల్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి అమృత్ సర్ కు 10న పార్శిల్ ఎక్స్ ప్రెస్, రేణిగుంట - సికింద్రాబాద్ కు డైలీ పార్శిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.

Also Read : 1000 కుటుంబాలకు చేయూతనందించిన గోపీచంద్

మరోవైపు దేశ వ్యాప్తంగా ఎక్కడక్కడ రైళ్ల రాకపోకలను ఏప్రిల్ 14వ తేదీ వరకూ నిలిపివేస్తూ ఇండియన్ రైల్వే ప్రకటించిన సంగతి విధితమే. ఏప్రిల్ 14 తర్వాత తిరిగి రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తారా ? లేదా ? అన్నదానిపై 12వ తేదీ తర్వాత స్పష్టత రానుంది. ఒక వేళ లాక్ డౌన్ తర్వాత రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తే మాత్రం పెద్దఎత్తున ప్రయాణికులు సొంత ఊర్లకెళ్లేందుకు రైల్వే స్టేషన్లకు తరలుతారు. ఇలా గుంపులు గుంపులుగా రైలులో ప్రయాణాలు మొదలైతే మళ్లీ కరోనా వైరస్ ప్రబలే ప్రమాదముంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని..తదుపరి నిర్ణయంపై రైల్వే శాఖ ప్రకటన చేయాల్సి ఉంటుంది.

Also Read : పసికందు సహా ముగ్గురికి కరోనా పాజిటివ్

దేశంలో లాక్ డౌన్ ను పొడిగించాల్సిందిగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరుతున్నారు. జూన్ 3వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగించాలన్న కేసీఆర్ అభిప్రాయానికి మద్దతిచ్చారు ఉద్ధవ్ ఠాక్రే, యోగీ ఆదిత్యనాథ్ తదితరులు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక దశల వారీగా ఎత్తివేస్తారా ? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

Next Story