1000 కుటుంబాలకు చేయూతనందించిన గోపీచంద్

By రాణి  Published on  7 April 2020 1:06 PM GMT
1000 కుటుంబాలకు చేయూతనందించిన గోపీచంద్

రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపించుకుంటున్న మన టాలీవుడ్ కథానాయకులు. కరోనాకు మొట్టమొదటిగా రూ.10 లక్షలు విరాళమిచ్చి నితిన్ విమర్శకులతో సైతం శభాష్ అనిపించుకున్నాడు. నితిన్ తర్వాత ఒక్కొక్కరు తమకు తోచిన సహాయాన్ని తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధులకు, పీఎం కేర్స్ కు, తెలుగు సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి విరాళాలనందించారు. హీరో నిఖిల్ డాక్టర్ల కోసం మాస్క్ లు, శానిటైజర్లను అందించగా..ఇప్పుడు గోపీచంద్ తనదైన స్టైల్ లో పేదలకు సహాయం చేశారు.

Also Read : టిక్ టాక్ పై ఫైర్ అవుతోన్న యూజర్లు

లాక్ డౌన్ కారణంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్న 1000కి పైగా కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. అలాగే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా 50 కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తానని ప్రకటించారు. ఆదిత్య మ్యూజిక్ నిర్వాహకులు తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.31 లక్షల విరాళాన్నిచ్చారు. అందుకు సంబంధించిన చెక్ ను మంత్రులు కేటీఆర్, తలసానిలకు అందజేశారు. అదేవిధంగా ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత రామ్ తల్లూరి కూడా రూ.5 లక్షలను సీఎం సహాయనిధికి అందించారు.

Also Read : పసికందు సహా ముగ్గురికి కరోనా పాజిటివ్

Next Story
Share it