హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం .. పేలిన సిలిండర్లు
By సుభాష్ Published on 29 May 2020 1:43 PM GMTహైదరాబాద్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో బాపూజీ నగర్‌లో అపార్ట్‌మెంట్ మధ్యలో ఉన్న కూలీలు వేసుకున్న గుడిసెలో భారీగా మంటలు వ్యాపించాయి. ఓ గుడిసెలో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు వ్యాపించడంతో మిగతా గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో మరో సిలిండర్ పేలింది. ముందే ఎండలు మండిపోతుండటతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
రెండు సిలిండర్లు పేలిన సమయంలో గుడిసెలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన స్థలానికి మంత్రి మల్లారెడ్డి చేరుకుని పరిశీలించారు.మంత్రి తరపున మంత్రి సతీమణి కల్పన రెడ్డి తక్షణ సహాయంగా రూ. లక్ష బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ ప్రమాదంలో 11 గుడిసెలు, ఆటోలు పూర్తిగా దగ్దం అయ్యాయి.