బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

By సుభాష్  Published on  14 Oct 2020 9:59 AM GMT
బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు మృతి చెందారు. ముందుగా ఇద్దరు మృతి చెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలీగఢ్‌ ఢిల్లీ గేట్‌ ప్రాంతంలోని ఖాతికన్‌ ప్రాంతంలోని ఓ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో భవనం కుప్పకూలింది. పరిసరాల్లో పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా భవనంపై కప్పు కూలడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గాయపడ్డవారిని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కూలిన భవనం శిథిలాలను తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

సిలిండర్‌ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో స్థానిక వలటీర్ల బృందాలు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అయితే పేలుడు సిలిండరే కాకుండా మరేదైన పేలుడు కారకాలకు సంబంధించి పనులు జరుగుతున్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నట్లు నగర పోలీసు సూపరింటెండెంట్‌ అభిషేక్‌ తెలిపారు.

Next Story
Share it