రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 16 మంది సైనికులు మృతి

By సుభాష్  Published on  14 Oct 2020 9:36 AM GMT
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 16 మంది సైనికులు మృతి

ఆప్ఘన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గోజర్దా౦-ఏ-నూర్‌ జిల్లాలోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 16మంది సైనికులు మృతి చెందారు. మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రావిన్స్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో తాలిబన్లకు భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి.

దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్దంలో పదివేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు.గత రెండు నెలల కిందటే ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వం - తాలిబన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే. చర్చలు ప్రారంభమైనా.. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story