రవి ప్రకాష్ కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. పిటిషన్ వారెంట్ పై రవి ప్రకాష్ ను సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్‌ ఐడీ క్రియేట్ చేసినట్లు కేసు పెట్టారు. 406/66 ఐటీ యాక్ట్ కింద రవి ప్రకాష్ పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.  కాసేపటి క్రితమే రవి ప్రకాష్ ను కూకట్ పల్లి కోర్ట్ కు పోలీసులు తీసుకొచ్చారు. రవి ప్రకాష్ కు 14 రోజుల రిమాండ్ విధించింఇ 16th ఎంఎం కోర్ట్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.