చెన్నై చేరుకున్న సీఎస్‌కే సారథి.. అతనితో పాటు వారు కూడా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2020 5:34 PM ISTటీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్.. చెన్నె సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక విమానంలో శుక్రవారం చెన్నై చేరుకున్నాడు. మహీతో పాటు విమానంలో మోను కుమార్, పియూష్ చావ్లా, కర్ణ్ శర్మ, పేసర్ దీపక్ చాహర్‌తో కలిసి దిగిన ఫొటోను సీఎస్‌కే వైస్ కెప్టెన్ సురేష్ రైనా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ఐపీఎల్-13లో భాగంగా సీఎస్‌కే శిక్షణా శిబిరం చెన్నైలోని చిదంబరం మైదానంలో ఆదివారం ప్రారంభం కానుంది. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ ఆధ్వర్యంలో వారంపాటు ఈ శిబిరం కొనసాగనుంది. ఈనెల 21 సీఎస్‌కే జట్టు యూఏఈ పయనమవనుంది. సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 22న యూఏఈలో జట్టుతో కలవనున్నాడు.
ఇదిలావుంటే.. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ జరుగనుంది. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆరంభ మ్యాచ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరగనుంది. కాగా, భారత కాలమానం ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం అరగంట ముందుగా అంటే.. రా.7.30కే మ్యాచ్‌లు మొదలు పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. ఇక మధ్యాహ్నం మ్యాచులు 3:30గంటలకు ఆరంభం అవుతాయి.
💪✌️ pic.twitter.com/AhiQa9mAJi
— Suresh Raina🇮🇳 (@ImRaina) August 14, 2020