ముఖ్యాంశాలు

  • ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని కోరిన సీఎస్‌
  • కేవలం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్‌
  • స్థానికంగా కరోనా ఎవరీకి సోకలేదు- సీఎస్‌ నీలం సాహ్ని

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఆరు వారాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని నీలం సాహ్ని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అసరమైన సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల సేకరణ, ఓట్ల జాబితాలు ముద్రణ పూర్తైందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో సీఎస్‌ తెలిపారు. ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపుంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్లమన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

వైద్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఇచ్చిన నివేదికను కూడా పంపిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థలు చాలా సమర్థవంతంఆ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మరో మూడు, నాలుగు వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్‌ పేర్కొన్నారు.

కేవలం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రే కరోనా పాజిటివ్‌ అని తేలిందని, స్థానికంగా ఎవరికీ కరోనా సోకలేదని సీఎస్‌ నీలం సాహ్ని తెలిపారు. అనుకున్న సమయానికే ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని సీఎస్‌ కోరారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.