జూబ్లీహిల్స్‌లో సీఆర్పీఎఫ్‌ ఎస్సై ఆత్మహత్య

By అంజి  Published on  19 March 2020 6:58 AM GMT
జూబ్లీహిల్స్‌లో సీఆర్పీఎఫ్‌ ఎస్సై ఆత్మహత్య

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో సీఆర్పీఎఫ్‌ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఆర్పీఎఫ్‌ క్వార్టర్స్‌లోని వినోద గదిలో సీలింగ్‌ ఫ్యాన్స్‌కు ఉరి వేసుకొని ఎస్సై శ్రీ భవానీ శంకర్‌ బలవన్మరణం చెందాడు. ఎస్సై భవానీ శంకర్‌ (30) రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వాడు. సెలవుల్లో ఉన్న భవానీ శంకర్‌ 10 రోజుల క్రితమే నగరానికి వచ్చి డ్యూటీలో చేరాడు. వివాహం కోసం సెలవుల్లో మృతుడు తన స్వస్థలం రాజస్థాన్‌ వెళ్లాడని తెలిసింది. విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: నగ్నంగా పూజ చేయాలి.. యువతికి పూజారి మాయమాటలు

భవానీ శంకర్‌ వ్యక్తి గత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భవానీ శంకర్‌ మృతదేహన్ని సీఆర్పీఎఫ్‌ క్వార్టర్స్‌ నుంచి పోస్ట్‌మార్టం నిమిత్తం అధికారులు ఆస్పత్రికి తరలించారు. భవానీ శంకర్‌ గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

Also Read: భారత్ లో 172 కరోనా కేసులు..

Next Story