ఇసుకవేస్తే రాలనంత మంది జనం, భారీ సంఖ్యలో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్ లో ర్యాలీకి వెళ్లిన సమయంలో ఇంత మంది అభిమానులు వచ్చారని చెబుతూ ఉన్నారు.
योगी आदित्यनाथ को सुनने के लिए बिहार की एक रैली में उमड़ा जनसैलाब.. जय श्री राम के नारों से गूंजा मैदान అంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
యోగి ఆదిత్యనాథ్ మాటలను వినడానికి జనం పెద్ద ఎత్తున పోగయ్యారని.. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. గూంజా మైదాన్ లో ఇలా ఆయన అభిమానులతో జన సంద్రంగా మారిందంటూ పోస్టులు పెట్టారు.
ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ ఈ ఫోటోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. 2014 సంవత్సరానికి సంబంధించిన ఫోటో ఇది. ఇప్పటి బీహార్ ఎన్నికల ప్రచారానికి ఈ ఫోటోకు ఎటువంటి సంబంధం లేదు.
న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. @ibtlx అనే యూజర్ ఫిబ్రవరి 5, 2014న ఇదే ఫోటోను పోస్టు చేశారు. ఆ ఫోటోకు “Look here:- Glimpse of #NaMo’s #JanChetnaSabha of Kolkata from Helicopter View.” అంటూ చెప్పుకొచ్చారు. కలకత్తాలో నరేంద్ర మోదీ జన చేతన సభకు సంబంధించిన హెలీకాఫ్టర్ వ్యూ ఇదని ఆ ఫోటో ద్వారా తెలియజేశారు. సభకు హాజరైన జనానికి సంబంధించిన ఫోటోను హెలీకాఫ్టర్ నుండి తీశారు.
అప్పటి ఈ సభపై పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అలాగే ఫోటోలను కూడా పోస్టు చేశాయి. Desh Gujarat కూడా ఫిబ్రవరి 5, 2014న ఈ ఫోటోను పబ్లిష్ చేశారు. కోల్ కతా లో నరేంద్ర మోదీ సభకు హాజరైన అభిమానులకు సంబంధించిన ఫోటో గ్యాలరీ కూడా గమనించవచ్చు.
Image source: Deshgujarat.com
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 20, 2020న వెళ్లారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.
2014లో నరేంద్ర మోదీ ర్యాలీకి సంబంధించిన ఫోటోను ఇటీవల యోగి ఆదిత్యనాథ్ బీహార్ కు వెళ్ళినప్పుడు వచ్చిన జనసందోహంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.