వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పలు అంశాలపై మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారని వైసీపీ తెలిపింది.
ఇటీవలే వైఎస్ జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే చూస్తున్నారన్నారు. కేడర్ అంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు.