Hyderabad : మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లిన యూట్యూబర్ అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్‌ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసిన‌ భానుచందర్ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  18 Dec 2024 12:48 PM GMT
Hyderabad : మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లిన యూట్యూబర్ అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్‌ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లి న్యూసెన్స్ క్రియేట్ చేసిన‌ భానుచందర్ అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.. భానుచందర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-9 వద్ద డబ్బులు పడేస్తున్నానని.. అవసరమైన వాళ్లు తీసుకోవచ్చని పేర్కొంటూ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. ఈ విష‌య‌మై వెంటనే స్పందించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఘట్ కేసర్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ప్రెస్ మీట్ నిర్వహించారు..

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన రాయలాపురం భాను చందర్ అనే వ్యక్తి ఘట్ కేసర్ వద్ద అవుటర్ రింగు రోడ్డు ప‌క్క‌కు ఉన్న చెట్ల పొదల్లో డబ్బులు విసిరి మనీ హంట్ ఛాలెంజ్ చేసి.. వీడియో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేశాడ‌ని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారడంతో ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి బిఎన్ఎస్ సెక్షన్ 179 నేషనల్ యాక్ట్ 1956 ప్రకారం.. భాను చందర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏసిపి చక్రపాణి తెలిపారు.


Next Story