హైదరాబాద్‌లో రాహుల్‌ దారుణ హత్య.. ట్విస్ట్‌లు మాములుగా లేవుగా!

రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

By అంజి  Published on  30 Aug 2023 9:24 AM IST
Rajendranagar, Crime news, Hyderabad

హైదరాబాద్‌లో రాహుల్‌ దారుణ హత్య.. ట్విస్ట్‌లు మాములుగా లేవుగా!

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహం రక్తం మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సెలబ్రెటీ జిమ్ సెల్లార్‌లో యువకుడిని గుర్తు తెలియని కొందరు దుండగులు హత్య చేశారు. జిమ్ ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో యువకుడిపై దాడి జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యకు గురైన యువకుడిని రాహుల్‌గా గుర్తించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఆ యువకుడిపై ఎవరు దాడి చేశారు? రాహుల్ ను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎందుకు చంపారనే వివరాలను ఛేదించేందుకు పోలీసులు పనిలో పడ్డారు.

రాహుల్ సింగ్ దారుణ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ కొన్ని సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ ప్రేమ జంట చట్టా పట్టాలేసుకొని ఊరంతా తిరిగారు. ఏం జరిగిందో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా ప్రేయసితో రాహుల్‌కు వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే రాహుల్ సింగ్ ప్రేయసిని పక్కన పెట్టాడు. ప్రేయసిని కాదని నెల క్రితం వేరే అమ్మాయితో రాహుల్ సింగ్ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. దీంతో తననే వివాహం చేసుకోవాలని ప్రేయసి పట్టు పట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. చిలికి చిలికి గాలి వాన పెద్దదైనట్లుగా ఆ వివాదం కాస్త ఇద్దరు మధ్య ముదిరింది. ఇంతలోనే ప్రేయసికి కన్నింగ్ ఐడియా వచ్చింది. ప్రియుడు వద్ద నుండి డబ్బులు లాగాలని ప్రేయసి, ఆమె తల్లి ప్లాన్ వేశారు.

ఈ క్రమంలోనే ప్రేయసి, రాహుల్ సింగ్‌ను ఇటీవలే ఓ జాదుఘర్ వద్దకు తీసుకెళ్లింది. మ్యాటర్ సెటిల్ చేస్తానని జాదూగర్ మాయమాటలు చెప్పి రాహుల్ సింగ్ వద్ద రూ.4 లక్షలు, బంగారు ఆభరణాలు నొక్కేశాడు. ఈ విషయం తెలియడంతో ఈనెల 24న జాదుఘర్‌తో రాహుల్ సింగ్ మధ్య గొడవ నెలకొన్నది. తన వద్ద తీసుకున్న 4లక్షల నగదు బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వాలని జాదుఘర్ కు రాహుల్ సింగ్ డెడ్ లైన్ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి లోనైనా జాదూగర్ , రాహుల్ సింగ్ హత్యకు ప్లాన్ వేశాడు. అజార్ అనే మరో వ్యక్తితో కలిసి రాజేంద్రనగర్ హైదర్ గూడ సెలబ్రిటీ జిమ్ సెల్లార్ వద్ద రాహుల్ మొహం పై పెప్పర్ స్ప్రే చల్లి హత్య చేసి అనంతరం ఇద్దరు నిందితులు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు. సీసీ ఫుటేజ్, రాహుల్ సింగ్ కాల్ డేటా, వీడియో కాల్స్ వాట్స్ అప్ చాటింగ్ ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story