Hyderabad: మైనర్‌పై అత్యాచారం.. యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

2017లో సరూర్‌నగర్‌లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓ యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

By అంజి  Published on  9 May 2024 11:35 AM GMT
Youth gets 10 years RI for raping minor in Hyderabad

Hyderabad: మైనర్‌పై అత్యాచారం.. యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్: 2017లో సరూర్‌నగర్‌లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓ యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. మే 2017లో సరూర్‌నగర్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19) అనే యువకుడు బాలికను తినుబండారాలు ఇచ్చి తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఖాజా మొయినుద్దీన్‌ను అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి.. దర్యాప్తు అధికారి, బృందం కృషిని అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు.

ఈరోజు 9వ తేదీన ఉదయం రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ లో ఉన్న ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు ఓ నింది తుడికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 11వేల రూపా యల జరిమానా విధించింది. నిందితుడు తన సోదరి స్నేహితురాలిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడమే కాకుండా అపహరణ చేసేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అన్ని సాక్ష్యాలతో సహా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులో ఈ ఘటనపై వాద ప్రతి వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించారు. సరూర్‌నగర్ ప్రాంతంలోని కర్మన్ఘాట్ శుభోదయ కాలనీలో నిందితుడు మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్(19) తన కుటుంబంతో కలిసి నివాసము ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతనికి ఒక సోదరి ఉంది. సోదరి స్నేహితురాలైన ఒక మైనర్ బాలిక మీద మొయినుద్దీన్ కన్ను పడింది. దీంతో ప్రతినిత్యం ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసాడు. అంతేకాకుండా బాలిక తనకు లొంగడం లేదని గ్రహించి మొయినుద్దీన్ బాలికను అపహరణ చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి. నిందితుడు మొయినుద్దీన్ ను కోర్టులో హాజరపరిచారు. ఈ మేరకు కోర్టు వాద ప్రతి వాదనలు విన్న అనంతరం నిందితుడు మొయినుద్దీన్ కు 10 సంవత్సరాల కఠిన కారాగారా శిక్షతోపాటు 11000 రూపాయల జరిమానా విధించడమే కాకుండా బాలికకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ తీర్పు వెల్లడించింది.

Next Story