ఖమ్మంలో యువకుడు ఆత్మహత్య
Youth commits suicide in Khammam. మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడు మంగళవారం ఖమ్మంలో
By Medi Samrat Published on 25 Jan 2022 7:30 PM IST
మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడు మంగళవారం ఖమ్మంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారంకు చెందిన ముత్యాల సాగర్ (25)గా గుర్తించారు. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్‌పై తల తెగిపడి ఉన్న అతని మృతదేహం లభ్యమైంది. మృతుడు గత మూడు సంవత్సరాలుగా నిరుద్యోగి. ఉద్యోగం రావట్లేదని నిరాశకు లోనై అందుకు సంబంధించి.. తన వాట్సాప్ స్టేటస్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. సాగర్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలిసింది.
కాగా, మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిరసనకు దిగారు. దీంతో యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించే చోట స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పి.రంగారావు, బిజెపి నాయకులు గల్లా సత్యనారాయణ, కె.శ్రీధర్‌రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.