తెలంగాణలో ఇద్దరు యువకులు ఆత్మహత్య.. పెళ్లికి ముందురోజు ఒకరు.. పెళ్లి కావడం లేదని మరొకరు..
పెళ్లికి ఒక రోజు ముందు, మంగళవారం రాత్రి యెడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం తర్వాత...
By - అంజి |
తెలంగాణలో ఇద్దరు యువకులు ఆత్మహత్య.. పెళ్లికి ముందురోజు ఒకరు.. పెళ్లి కావడం లేదని మరొకరు..
నిజామాబాద్: పెళ్లికి ఒక రోజు ముందు, మంగళవారం రాత్రి యెడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం తర్వాత 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వివాహం గురువారం జరగాల్సి ఉంది. గొడవ తర్వాత తేపురి ప్రతాప్ గౌడ్ అనే రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, అదే విషయంపై కుటుంబ వివాదం తర్వాత కలత చెందినట్లు తెలుస్తోంది. అతని సోదరుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెళ్లి కావడం లేదని ఆత్మహత్య
ఇదిలా ఉంటే.. పెళ్లి కావడం లేదని మనస్థాపం చెంది ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి బూర సురేష్(30) అనే యువ కుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ ఆత్మకూరు కి చెందిన నరేష్ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి అమీర్‌పేట్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ.. బట్టల షాపులో ఉద్యోగం చేస్తున్నాడు.
అమీర్పేట్ నుండి ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చి రేపల్లె ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చారికి తరలించారు. అయితే గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని నరేష్ మదనపడుతున్నట్లు తెలిసింది. పెళ్లి సంబంధాలు కుదురుటలేదని నరేష్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.